ఘనంగా ప్రీ క్రిస్టమస్ వేడుకలు
పరాలకిమిడి:స్థానిక రామ్ నగర్ లో గల బేతేలు ప్రార్థన మందిరం (చర్చ్)వార్షికోత్సవం మరియు ప్రీ క్రిస్టమస్ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హైటెక్ విద్యా సంస్థలు అధినేత ,బీజేడీ పార్టీ నాయకుడు తిరుపతి పాణిగ్రహి పాల్గొని ఏసు క్రీస్తు యొక్క గొప్ప తనాన్ని విచారించారు.ప్రపంచ శాంతి కొరకు ఏసు క్రీస్తు పుట్టాడు అని,ఏసు క్రీస్తు యొక్క సందేశాన్ని వివరించారు.విశాఖపట్నం నుంచి ఎన్ సి సి చర్చ్ బ్రదర్ శామ్యూల్ జాన్ మరియు పాస్టర్ శిశు దాస్ జెన్నలు ఏసు క్రీస్తు జననం పై నిర్వహించిన నృత్యాలు, కీర్తనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లాపరిషత్ అధ్యక్షుడు గవర తిరుపతి, మునిసిపల్ చైర్మన్ నిర్మలా శెట్టి తదితరులు పాల్గొన్నారు.