News & Article
పాతపట్నం నియోజకవర్గం. జనసేన పార్టీ జనవాణి-జన చైతన్యం కార్యక్రమం
శ్రీకాకుళం జిల్లా…
పాతపట్నం నియోజకవర్గం.
జనసేన పార్టీ జనవాణి-జన చైతన్యం కార్యక్రమంలో భాగంగా మెలియాపుట్టి మండలంలోని రట్టిని గ్రామంలో జనసేన పార్టీ పాతపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ గేదెల చైతన్య ఇంటింటికి వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి వారి సమస్యలను తెలుసుకొని త్వరలోనే అన్ని విధాల పరిష్కారం చేస్తామని అందుకోసం జనసేన పార్టీ పోరాడుతుందని హామీ ఇచ్చారు. అలాగే జనసేన పార్టీకి ఒక అవకాశం ఇవ్వమని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు చింతల ప్రశాంత్ దివ్య, దుక్క బాలరాజు, రత్నాలమ్మ,మంగమ్మ,వెంకట్, కుమారి,బుజ్జి,స్వాతి, సవర రామ మూర్తి, పాపారావు యాదవ్, రాజానమోహన్, మణికంఠ, రాకేష్, శ్రీను,జనార్ధనరావు జనసేన నాయకులు పాల్గొన్నారు.